Bharateeyudu (Telugu)

99.00

1 in stock

Description

Bharateeyudu (Telugu)
SFCD1/222
Music Director > A.R.Rahman
Record Label > T-Series
Condition > Like New

తందానానే తానానే ఆనందమే
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు
చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకచిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం
చెలియ వయసుడిగే స్వగతంలో అనుబందం అనందమానందం
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి వొళ్ళే ఆనందం
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
అందం ఓ ఆనందం బంధం పరమానందం
చెలియా ఇతరులకై కను జారే కన్నీరే అనందమానందం
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు (2)
చిన్న చిన్న గూటిలోనె స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోకచిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటె చాలునంట డబ్బు గిబ్బు లెందుకంట
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమె ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

Additional information

Weight 100 g

Reviews

There are no reviews yet.

Be the first to review “Bharateeyudu (Telugu)”

Your email address will not be published. Required fields are marked *